FbTelugu

నిన్న అచ్చెన్న‌… నేడు ప్ర‌భాక‌ర్‌రెడ్డి.. రేపు ?

తెలుగు త‌మ్ముళ్ల లెక్క‌లివి. వైసీపీ ప్ర‌భుత్వ దూకుడు చాలామందిలో వ‌ణ‌కు పుట్టిస్తుంది.

ఇదంతా ఏపీ స‌ర్కారు కావాల‌ని చేస్తుందా! క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుందా! నిజంగానే ఐదేళ్ల‌పాటు టీడీపీ నేత‌లు అంత‌గా తెగ‌బ‌డ్డారా! ఏమో.. కానీ దానితాలూకూ ప్ర‌తిఫ‌లం ఇప్పుడు అనుభ‌వించాల్సి వ‌స్తోందంటూ వేదాంత ధోర‌ణితో మాట్లాడుతున్న నేత‌లూ లేక‌పోలేదు. కాసేపు ఈ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే… మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈఎస్ ఐ కుంభ‌కోణంలో పీక‌ల్లోతు ఇరుక్కున్నాడు. రూ.150కోట్ల అవినీతిలో అచ్చెన్న కూడా భాగ‌మంటూ ఏసీబీ ఆరోపిస్తూ.. కేసులు.. ద‌ర్యాప్తులు అరెస్టులు అన్నీ చేసేసింది.

న‌కిలీ ఇన్వాయిస్‌ల‌తో 100కు పైగా తుక్కును లారీలు, బ‌స్సులుగా మార్చేసిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి అండ్ త‌న‌యుడు అస్మిత్‌రెడ్డిల‌కు రిమాండ్ విధించారు. జైల్లో ఏ నెంబ‌ర్లు కేటాయించార‌నేది కూడా ప్ర‌క‌టించారు. ఇదంతా జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ముందుగానే చెప్పారు. టీడీపీ ప్ర‌భుత్వంలో జ‌రిగిన అవినీతిని వెలికితీసి.. కార‌కుల‌ను జైలు ఊచ‌లు లెక్కించేలా చేస్తామంటూ ప్ర‌జ‌ల‌కు హామీ కూడా ఇచ్చారు. న‌వ‌ర‌త్నాల మాదిరిగా దాన్ని కూడా అమ‌లు చేస్తున్నామంటూ వైసీపీ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి.

పోన్లే.. అయిందేదో అయింది. మ‌నం మ‌నం బ‌రంపురం అంటూ పాలిటిక్స్‌లో ఉండే స‌ర్దుబాట్లు.. వైసీపీ స‌ర్కారులో కుద‌ర‌ద‌టంటూ వైసీపీలోని ద‌ళారుల‌కు జ‌గ‌న్ ఏ నాడో చెప్పేశార‌ట‌. మా వాళ్లే.. కాస్త చూసీచూడ‌న‌ట్టు పొమ్మంటూ సొంత కులం మాజీల త‌ర‌పున వ‌కాల్తా పుచ్చుకున్న వైసీపీ పెద్ద‌ల‌కూ చీవాట్లు పడ్డాయ‌ట‌. దీంతో ఇటీవ‌ల ఇద్ద‌రు ఎంపీల రాయ‌బారం కూడా బెడ‌సికొట్టింద‌ట‌. దీంతో అవినీతి మ‌చ్చ‌లున్న ప్ర‌తి ఒక్క‌రూ ఊచ‌లు లెక్క‌బెట్ట‌డం ఖాయ‌మ‌నే ప్ర‌చారం ఊపందుకుంది.

అనారోగ్యంతో ఆప‌రేష‌న్లు చేయించుకున్నామంటూ మొత్తుకున్నా.. అచ్చెన్న‌, ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఇద్ద‌రినీ అరెస్టు చేశారు. ఇదే స్పీడుతో.. మున్ముందు ఏ మాజీ నేత ఉండ‌బోతున్నాడ‌నేది ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. టీడీపీ వ‌ర్గాల్లోనూ ఇదేర‌క‌మైన‌  చ‌ర్చ మొద‌లైంది.. టీడీపీ సీనియ‌ర్ నేత‌లు  పితాని, య‌ర‌ప‌తినేని  పేర్ల‌ను తాజాగా వైసీపీ నేత‌లు తెర‌మీద‌కు తెచ్చారు. అచ్చెన్న‌, ప్ర‌భాక‌ర్‌రెడ్డి త‌రువాత ఈ ఇద్ద‌రిలో ఎవ‌రో ఒకరు ఖాయ‌మంటున్నారు.

ముఖ్యంగా గుర‌జాల మాజీ ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు అక్ర‌మ మైనింగ్‌పై సీబీఐ ద‌ర్యాప్తు చేస్తుంది. రూ.200 కోట్ల వ‌ర‌కూ కుంభ‌కోణం ఉంద‌నే ఆరోప‌ణ‌లున్నాయి. ఈ నేప‌థ్యంలో య‌ర‌ప‌తినేని జైలుకెళ్ల‌టం ఖాయ‌మంటూ వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి హింట్ కూడా ఇచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.