FbTelugu

ఎల్లో మీడియా అవాస్త‌వ క‌థ‌నాలు: సజ్జల

తాడేపల్లి: రాష్ట్రంలో ఎల్లో మీడియా అడ్డ‌గోలుగా క‌థ‌నాలు రాయ‌డం అనైతిక‌మే కాకుండా చ‌ట్ట‌వ్య‌తిరేకం అని ప్ర‌భుత్వ ‌స‌ల‌హాదారులు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఆరోపించారు.

తాడేప‌ల్లి పార్టీ కేంద్ర కార్యాల‌యం లో ప్ర‌భుత్వ ‌స‌ల‌హాదారులు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మాట్లాడారు. ప‌త్రిక‌లనేవి వాస్త‌వాలు రాయాలి. కోర్టు కే‌సుల‌పై నిగ్ర‌హం పాటించాలని ఆయన హితవు పలికారు. వ‌క్రీక‌ర‌ణ‌ల‌తో న్యాయ‌స్థానాన్ని ప్ర‌భావితం చే‌సే ప్ర‌య‌త్నాలు కాదా? అని ప్రశ్నించారు. ఈనాడు, మరో పత్రిక వార్తా కథనాలు.. చంద్రబాబు నాయుడు మోసం వల్ల నష్టపోయిన రైతుల పుండు మీద కారం చల్లినట్టు కాదా అన్నారు.
రాజధాని తరలింపుపై కేసులు నడుస్తుండగా, మరోవైపు న్యాయ‌మూర్తుల‌ను ప్ర‌భావితం చేసేలా నిర‌స‌న‌లా అని రామ‌కృష్ణారెడ్డి నిలదీశారు. ప్ర‌జాస్వామ్య ప‌ద్ద‌తిలో ఎన్నుకోబ‌డిన ప్ర‌భుత్వం, రాజ్యాంగ బ‌ద్దంగా నిర్ణ‌యం తీసుకుంటే వ్య‌తిరేకిస్తున్నారన్నారు. మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు రంగుల క‌ల.. ఈనాడు పేప‌ర్ లో రాశారు. ఆ రంగుల క‌ల‌ను న‌మ్ముకునే చంద్ర‌బాబు నిండా మునిగారని ఆయన అన్నారు. రాజ‌ధాని మార్చ‌ట్లేదు, వికేంద్రీక‌ర‌ణ చేస్తున్నామన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.