FbTelugu

కాషాయంలోకి ప‌సుపు కొమ్ములు!

Yellow-horns-into-Orange

అర్రె.. ఇదేం లెక్క‌. ఆలు లేదు. శూలూ లేదు.. క‌నీసం ప‌వ‌ర్ లేదు. అటువంటి పార్టీలోకి తెలుగు త‌మ్ముళ్లు చేర‌తారా! చాలామందికి ఇదే అనుమానం. కానీ.. ఎక్క‌డో కొడుతుంది.. మామూలుగానే టీడీపీ అంటే జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి విరుచుకుప‌డుతుంటాడు. పైగా ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఐదు నెల‌ల‌కే సీనియ‌ర్ నేత‌ల‌కే చుక్క‌లు చూపారు. పాత రికార్డులు బ‌య‌ట‌కు తీసి ఇదిగో మీ పాపాల చిట్టా. అంటూ నిన్న‌టి వ‌ర‌కూ త‌న అవినీతిపై గ‌ళ‌మెత్తిన నేత‌ల ప‌రువు న‌డిబ‌జార్లో పెట్టేప‌నిలో ప‌డ్డారు. అందుకే.. ఎందుకీ తంటా.. క‌నీసం బీజేపీలోకి చేరితే కేసుల సంగ‌తి ఎలా ఉన్నా ప‌రువు ద‌క్కించుకున్న‌ట్ట‌యినా ఉంటుంద‌నే భ‌రోసా ద‌క్కుతుంద‌ని త‌మ్ముళ్లు లెక్క‌లు వేసుకుంటున్నార‌ట‌.

అయితే మొద‌ట్లో వైసీపీలోకి జంప్ చేద్దామ‌ని భావించిన వీరంద‌రికీ.. మొన్న జూపూడి ప్రభాకర్.. నిన్న వ‌ల్ల‌భ‌నేని వంశీ వంటి వారు వైసీపీ తీర్థం పుచ్చుకుంటే.. అక్క‌డ ఎదురైన వ్య‌తిరేక‌త‌తో కాషాయం వైపు క‌దులుతున్నార‌ట‌. దీనికి ఎమ్మెల్యే గంటా సార‌థ్యం వ‌హిస్తున్నార‌నే పుకార్లు వేగం అందుకున్నాయి. గ‌తంలోనూ గంటా శ్రీనివాస్ మ‌రో ఏడుగురు ఎమ్మెల్యేల‌తో క‌ల‌సి వైసీపీలోకి చేర‌తారంటూ ప్ర‌చారం జ‌రిగింది. ఆ స‌మ‌యంలో ఆయ‌న గోవాలో ఉండ‌టం కూడా ప్ర‌చారానికి బలాన్ని చేకూర్చింది. ఇప్పుడు ఏతావాతా.. తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు 10 మంది వ‌ర‌కూ చివ‌ర‌కు తేల్చింది ఏమిటంటే బీజేపీలోకి చేరి 2024 ఎన్నిక‌ల వ‌ర‌కూ ప‌రువు కాపాడుకుందాం. క‌నీసం కేంద్రంలో ఉన్న పెద్ద‌లు ఆప‌ద స‌మ‌యంలో ఆదుకునే అవ‌కాశాలుంటాయ‌ని త‌ల‌పోస్తున్నార‌ట‌. దీనికి ముహూర్తం కూడా దాదాపు ఖ‌రారు చేశారట‌. కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి, ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ కూడా హైక‌మాండ్ దృష్టికి విష‌యాన్ని తీసుకెళ్లార‌ట‌.

అక్క‌డ నుంచి ఆమోద‌ముద్ర ప‌డగానే.. వ‌ల‌స‌లు మొద‌ల‌వుతాయ‌ట‌. అయితే రాజకీయ విలువ‌ల గురించి చెప్పే వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి, స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం ఏ అడ్డుపుల్ల వేస్తార‌నే గుబులు కూడా ఉంద‌ట‌. అందుకే న్యాయ‌ప‌ర‌మైన అంశాల‌న్నింటినీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని జంప్ చేసేందుకు గంటా అండ్ కో రెడీ అవుతున్నార‌ట‌. అదే జ‌రిగితే.. పాపం చంద్రబాబు నాయ‌క‌త్వ ఎంత బ‌లంగా ఉంద‌నేది ప్ర‌పంచానికి తెలుస్తుంది.. చూశారా.. సొంత ఎమ్మెల్యేల‌ను గోడ దూకించార‌నేందుకు వైసీపీకూ అవ‌కాశం చిక్కిన‌ట్టూ అవుతుంది.

You might also like