FbTelugu

యడియూరప్ప, కూతురికి కూడా కరోనా

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప(78) తో పాటు ఆయన కుమార్తె కు కూడా కరోనా సోకింది. కుమార్తె కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు బెంగళూరులోని మణిపాల్‌ ఆస్పత్రి వెల్లడించింది.

ప్రస్తుతం ఆమెను ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపింది. యడియూరప్ప వైద్యుల సలహా మేరకు ఆయన నిన్నే మణిపాల్‌ ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.

You might also like