FbTelugu

లక్షల కోట్ల విలువైన భూములపై వైసీపీ కన్ను

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణ

అమరావతి: ఉత్తరాంధ్రలో రూ.1 లక్షా 30 వేల కోట్లకు పైగా విలువజేసే ట్రస్టు భూముల మీద కన్నేసి, కాజేయడానికి వైసీపీ పెద్దలు అధికార దుర్వినియోగం చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

మాన్సాస్ ట్రస్ట్ అన్నది ఒక ఉన్నతమైన లక్ష్యాలతో పూసపాటి వంశీయులు స్థాపించిన సంస్థ అని చంద్రబాబు అన్నారు. ఆ సంస్థ కింద 105 దేవాలయాలతో పాటు, ఎన్నో విద్యాలయాలు ఉన్నాయన్నారు. సంస్థకున్న పవిత్ర ఆశయాలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశంతో సహా ఏ పార్టీ అధికారంలో ఉన్నా సంస్థ విషయాల్లో జోక్యం చేసుకోలేదన్నారు.

తండ్రి ఆశయాలను బతికించుకోవటానికి కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు తపన పడుతున్నారు. ఆయనకు అందరూ అండగా నిలవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఒక పవిత్ర సంకల్పాన్ని బతికించాలని ఆయన అన్నారు.

You might also like