FbTelugu

వచ్చే ఎన్నికల్లో వైసీపీ 5 సిట్లే: విశ్వహిందూ పరిషత్

విజయవాడ: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీకి 151 బదులు మధ్యలో ఉన్న 5 సీట్లు మాత్రమే వస్తాయని విశ్వహిందూ పరిషత్ జోస్యం చెప్పింది. పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హిందూ వ్యతిరేక వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

వీహెచ్ పీ నాయకులు లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ నాయకులు ఇలాగే హిందూ మతంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు. మంత్రి కొడాలి నాని వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమలలో బ్రిటీష్ కాలం నుంచి హిందూమతయేతరుల కోసం డిక్లరేషన్ విధానం అమలుపరుస్తున్నారన్నారు.

ఎప్పటి నుంచో వస్తున్న ఈ సంప్రదాయాన్ని వద్దనడానికి నాని ఎవరి ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. అధికారం ఉంది కదా అని ఏదైనా చేస్తామంటే కుదరదని, తిరుమలలో డిక్లరేషన్ కొనసాగించాల్సిందేనని వారు డిమాండ్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.