FbTelugu

బీజేపీని టార్గెట్ చేసిన వైసీపీ

తాడేపల్లి: రాష్ట్రంలో బీజేపీ ని వైసీపీ ముఖ్య నేతలు లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు.
కేంద్రంలో అధికార పార్టీ అయినప్పటికీ ఏమాత్రం వెరవకుండా అవకాశం లభించినప్పుడల్లా తూర్పారబడుతున్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ రెడ్డి కల్లం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా వైసీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు.
ఏడాది కాలంగా తినడానికి ఏమీ దొరక్క నకనకలాడుతున్న టీడీపీ మిడతల దండు కమలం పువ్వు వైపు కదులోందని ఆయన ట్వీట్ చేశారు. ఇప్పటికే కొన్ని మిడతలు ఆ పార్టీలో చేరి విధ్వంసం సృష్టిస్తున్న విషయం గ్రహించేలోగానే మిగతావి ఎగురుకుంటూ బయల్దేరాయి. ఈ విపత్తు నుంచి బీజేపీ ఏలా బయటపడుతుందో చూడాలి అంటూ విజయసాయి చురక అంటించారు.

మరో అడుగు ముందుకేసి మీడియా ఎంటర్ టైనర్ల పై విమర్శలు చేశారు. స్వార్థం కోసం జెండాలు మార్చేవారంతా లిటిగేటర్ల అవతారమెత్తుతున్నాయి. ప్రజాతీర్పును అపహాస్యం చేయాలని చూస్తే ఏ వ్యవస్థా ఉపేక్షించదు. పతనమైన విలువలకు ప్రాణం పోసేయత్నం చేస్తున్న జగన్ను ఈ శక్తులేవి అడ్డుకోలేవు. మీడియా ఎంటర్ టైనర్లుగా మిగలడం మినహా సాధించేది ఏముండదని విజయసాయి ట్వీట్ చేశారు.

You might also like