FbTelugu

వైసీపీ యూజ్ లెస్ ఫెలోస్…: ఎంపీ రాజు

ప.గో. జిల్లా: యూజ్ లెస్ ఫెలోస్,  బి కేర్ పుల్, ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడండని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తమ పార్టీకే చెందిన నేతలను ఉతికి ఆరేశారు.

కరోనా ఉధృతి తగ్గాక నియోజకవర్గానికి వస్తాను.. చూసుకుందాం అంటే చూసుకుందాం.. అని రాజు సవాల్ విసిరారు. నాపై కామెంట్లు చేసిన అయిదుగురు నా బొమ్మ పెట్టుకుని నెగ్గారని ఆయన ఆరోపించారు.

మీరంతా రాజీనామా చేసి, సీఎం  జగన్ రెడ్డి బొమ్మ మీద పోటీ చేయండి.. నేను రాజీనామా చేసి,  నా బొమ్మ మీద పోటీ చేస్తానన్నారు. అప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దాం అని అన్నారు. మీరు రాజీనామా చేస్తేనే నేను రాజీనామా చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ముందుగా మీరు రాజీనామా చేయండి, ఆ తరువాతే  నేను రాజీనామా చేస్తాను.. ఎవరి బొమ్మకు ఎంత విలువుందో తేల్చుకుందామంటూ రఘురామకృష్ణంరాజు ఘాటుగా హెచ్చరించారు.

సమాచార శాఖ మంత్రి పేర్ని నాని చీటికి మాటికి టీవిల్లో కనిపించే అందగాడంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. గుండెల మీద చెయ్యి వేసి చెబుతున్నా.. ఎన్నోసార్లు పార్టీలోకి రావాలని అడిగితే.. ఛీ.. రానని చెప్పాను. నా కర్మో,  మీ కర్మో.. మీ ప్రలోభాలకు లొంగి రావాల్సి వచ్చిందన్నారు. ఆత్మ సాక్షిగా చెబుతున్నాను.. పార్టీలోకి వస్తానని..ఛీ.. మిమ్మల్ని ఎప్పుడూ అడగలేదన్నారు. ఒక హై లెవెల్ లో ఉన్నవారితో తప్పా,  వీళ్ళతో నేను ఎప్పుడూ మాట్లాడలేదని ఎంపీ రఘురామకృష్ణంరాజు కుండబద్దలు కొట్టి చెప్పారు.

You might also like