అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో వర్గ వైషమ్యాలు రగల్చడమే టీడీపీ నేతల పని అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికా తీవ్ర విమర్శలు చేశారు.
‘‘పండగపూట గంగిరెద్దుల వేషంలో కొత్త పచ్చ గ్యాంగ్ తిరుగుతోంది. ఏపీలో మత విద్వేషాలు, కులాల మధ్య చిచ్చు, వర్గ వైషమ్యాలు రగల్చడమే వారిపని. రామతీర్థం నుంచి ఎవరి అజమాయిషీలో దాడులు జరిగాయి? విగ్రహాల ధ్వంసం కేసుల్లో పచ్చనేతలు, పచ్చ మీడియా ప్రతినిధుల పాత్ర ఎంత?’’అంటూ ట్వీట్ చేశారు.