FbTelugu

సీఎం పనితీరుతో రూ.344 కోట్లు దక్కాయి: విజయసాయిరెడ్డి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ పనితీరుతో రూ.344 కోట్లు రాష్ట్రానికి దక్కాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పౌరసేవల అమలులో ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం రివార్డును ప్రకటించిందని తెలిపారు.

పౌరసేవల సంస్కరణల్లో నాలుగింట మూడు సంస్కరణలు అమలు చేసినందుకు గానూ.. కేంద్రం నిన్న ఓ ప్రకటనలో మధ్యప్రదేశ్, ఏపీలకు రివార్డు ఇస్తున్నట్టు తెలిపింది. స్పెషల్ అసిస్టెన్స్ కింద మొత్తం రూ.1,004 కోట్లతో రివార్డు ప్రకటించగా, మధ్యప్రదేశ్ కు రూ.660 కోట్లు, ఏపీకి రూ.344 కోట్లు లభించినట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.