FbTelugu

పార్టీలకు అతీతంగా అందరికీ ఇళ్లు: విజయసాయి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పార్టీలకు అతీతంగా అందరికీ ఇళ్ల పట్టాలు అందేలా సీఎం జగన్ మోహన్ రెడ్డి చూస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో 25 లక్షల ఇళ్లు ఇస్తామన్నప్పటికీ రాష్ట్రంలో 30 లక్షల ఇళ్లు ఇస్తున్నట్టుగా తెలిపారు.

అలాగే మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.56 వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్టు తెలిపారు. నవరత్నాల్లోని అన్ని హామీలను సీఎం జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారన్నారు. జగన్ అభివృద్ధి పనులు చేపడుతుంటే.. చంద్రబాబు మాత్రం వాటిని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.