విశాఖపట్నం: ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొత్తు అని వైసీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి తీవ్రంగా విమర్శించారు.
రాష్రంలో కరోనా సమయంలో ఎన్నికలు రావడానికి నిమ్మగడ్డ రమేష్ కారణమని ఆయన ఆరోపించారు. కరోనా వైరస్ తో ప్రజలకు అపాయం ఏర్పడితే ఆయన బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు కోసమే ఎన్నికలు నిర్వహిస్తున్నారని, ప్రజల కోసం కాదని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు గౌరవిస్తున్నామని చెబుతూనే నిమ్మగడ్డ రమేష్ ను అధికార పార్టీ నేతలు ఏకి పారేస్తున్నారు.