FbTelugu

జుత్తాడ బాధిత కుటుంబానికి ఓదర్పు: ఎంపి వివిఎస్

విశాఖపట్నం: జుత్తాడ లో సామూహిక హత్యకు గురైన బాధిత కుటుంబాన్ని వైసిపి ఎంపీ వి.విజయసాయిరెడ్డి పరామర్శించారు. ఇవాళ శివాజీపాలెంలో బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి ఓదార్చారు.

ఆ రోజు రాత్రి జరిగిన ఘటన గురించి బాధితుడు విజయ్ ఎంపి విజయసాయిరెడ్డికి వివరించారు. అప్పలరాజు చేతిలో ఆరుగురు కుటుంబసభ్యులు హత్యకు గురైనారని తెలిపారు. అప్పలరాజుపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ, రూ.12 లక్షల పరిహారం అందచేస్తామని తెలిపారు. విజయ్ కుటుంబంలో అభిరానందన్ కు ఉచిత విద్యాభ్యాసంతో పాటు అరుణ కుమార్తెకు ఉద్యోగం ఇస్తామన్నారు. అప్పలరాజుకు హోంగార్డ్ శ్రీను సహకరించాడన్న తెలిపారన్నారు. వెంటనే హోంగార్డ్ శ్రీనును సస్పెండ్ చేసి విచారణ చేయిస్తామని ఎంపి విజయసాయిరెడ్డి తెలిపారు. ఆయన వెంటన స్థానిక వైసిపి నాయకులు పాల్గొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.