FbTelugu

ఎంతటివారైనా వదిలిపెట్టం: ఎంపీ వీవీఎస్

అమరావతి: విశాఖలోని హిందూస్థాన్ షిప్ యార్డులో ఓ భారీ క్రేన్ కుప్పకూలి 11 మందికి పైగా దుర్మరణం పాలవడం పట్ల వైసీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ ఘోర దుర్ఘటన పట్ల ఎంతో బాధపడుతున్నానని ఆయన తెలిపారు.

బాధిత కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. దుర్ఘటనలో ఆప్తులను కోల్పోయిన వారి కుటుంబాల పరిస్థితి పట్ల తన హృదయం చలించిపోయిందని అన్నారు. కుటుంబ సభ్యులు ఈ విషాదం నుంచి కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ చేస్తామని, ఈ ప్రమాదానికి కారకులు ఎంతవారైనా వదిలిపెట్టమని ఆయన హెచ్చరించారు.

You might also like