FbTelugu

రేపే సమాధానమిస్తా: వైసీపీ ఎంపీ రాజు

విజయవాడ: వైసీపీ అధిష్టానం జారీ చేసిన షోకాజ్‌ నోటీసుపై ఆ పార్టీ ఎంపీ కె.రఘు రామకృష్ణ రాజు స్పందించారు.

తనకు 7 రోజుల సమయం ఇచ్చినా గురువారమే సమాధానం పంపుతానని ఆయన అన్నారు. పార్టీని, అధినేతను పల్లెత్తు మాట అనలేదు, అదే వివరణ రేపు పంపిస్తానన్నారు. తనకు పంపించిన 18 పేజీల నోటీసులో రెండు పేజీలు రాతపూర్వకంగా ఉందన్నారు. మిగతా 16 పేజీలు వివిధ పత్రికా క్లిప్పింగ్లు జతపరిచారన్నారు.
ప్రభుత్వ పథకాలు కొన్నిచోట్ల సజావుగా అమలు కావట్లేదని, అర్హులకు అందేలా చూడాలని సూచనలు చేశానని ఆయన తెలిపారు. అధినేత వైఎస్.జగన్ రెడ్డి అపాయింట్‌మెంట్ దొరకనందునే మీడియా ముఖంగా తెలియజేశానని ఆయన వివరించారు. నేను ప్రభుత్వానికి సూచనలు చేశానే తప్ప పార్టీకి కాదని రఘు రామకృష్ణ రాజు తెలిపారు

You might also like