FbTelugu

సిఎం జగన్ నుంచి ప్రాణహాని: వైసిపి ఎంపి రాజు

న్యూఢిల్లీ: ఏపీ సిఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి నుంచి తనకు ప్రాణ హాని ఉందని నరసాపురం వైసిపి ఎంపి కె.రఘురామ కృష్ణరాజు ప్రధాని నరేంద్ర మోదికి ఫిర్యాదు చేశారు.
బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో కేసు వేసిన తరువాత తనకు జగన్ అభిమానులు, వైసిపి కార్యకర్తల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు.

గత కొద్ది నెలలుగా తనపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని అన్నారు. జగన్ కేసులపై హైకోర్టును ఆశ్రయించడంతో మరింతగా కక్ష పెంచుకున్నారని, భౌతికంగా తనను అడ్డు తొలగించేందుకు తన మనుషులను పురమాయించాడని వివరించారు. జగన్ కు క్రిమినల్ మనస్థత్వం ఉందని, ఫ్యాక్షనిస్టు కూడా అని ఆ లేఖలో రఘురామ కృష్ణరాజు ప్రధానికి వివరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.