FbTelugu

శాసన మండలి రద్దుచేయాలని జగన్ కు లేఖ

న్యూఢిల్లీ: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్నందున శాసన మండలిని రద్దు చేయించాలని వైసిపి ఎంపి కె.రఘురామ కృష్ణరాజు ఏపి సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు.

గత ఏడాది మండలిలో మెజారిటీ లేని సమయంలో రద్దు చేస్తూ అసెంబ్లీలో సిఎం జగన్ రెడ్డి తీర్మానం చేయించి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీలను కలిసి మండలిని రద్దు చేయాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. అమరావతి రాజధాని బిల్లు మండలిలో వీగిపోవడంతో జగన్ మండలి రద్దుపై నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మండలి రద్దు అంశాన్ని ఎంపి రఘురామ తాజాగా మళ్లీ లేవనెత్తారు. మెజారిటీ ఉన్నప్పుడు మండలిని రద్దు చేసి చిత్తశుద్ది నిరూపించుకోవాలని జగన్ ను కోరారు. గతేడాది మెజారి లేనప్పుడు రద్దు పై చేసిన తీర్మానం విషయంలో ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఇప్పడు వైసిపి బలం పెరిగినందున రద్దు చేస్తే జగన్ గౌరవం మరింత పెరుగుతందని, మాట మీద నిలబడే వ్యక్తి అనే పేరు వస్తుందన్నారు. సిఎం జగన్ తాను చెప్పిన మాటలను జనం నమ్మాలంటే తక్షణమే శాసన మండలిని రద్దు చేయాలని రఘురామ లేఖ లో డిమాండ్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.