FbTelugu

వైసిపి ఎంపి బెయిల్ పై నేడు సుప్రీంలో విచారణ

న్యూఢిల్లీ: నరసాపురం వైసిపి ఎంపి కె.రఘురామ కృష్ణమ రాజు బెయిల్ పిటీషన్ పై ఇవాళ ఉదయం సుప్రీంకోర్టులో విచారణ జరగనున్నది. ఏపి సిఐడి నమోదు చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు పిటీషన్ వేశారు.

ఈ పిటీషన్ పై జస్టిస్ వినీత్ శరన్, జస్టిస్ బిఆర్ గవాయ్ ల బెంచి విచారణ జరపనున్నది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేవాల వ్యాఖ్యలు చేశారని ఎంపి రఘురామ కృష్ణమ రాజు ను మూడు రోజుల క్రింద అరెస్టు చేసి ఏపికి తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. ఏపి హైకోర్టుకు వెళ్లగా సిఐడి కోర్టుకే వెళ్లాలని ఆదేశించడం, అక్కడికి వెళ్లగా ఈ నెల 28వ తేదీ వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.