FbTelugu

కరోనాతో వైసీపీ ఎంపీ మృతి

నెల్లూరు: తిరుపతి పార్లమెంటు సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ కరోనా పాజిటివ్ తో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బల్లి దుర్గాప్రసాద్ ఈరోజు సాయంత్రం 6 గంట సమయంలో చెన్నై అపోలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

దుర్గాప్రసాద్‌కు ఇటీవల కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయన అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే గుండెపోటు రావడంతో బుధవారం సాయంత్రం సుమారు 6.00 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. దుర్గాప్రసాద్‌ 28 ఏళ్లకే మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 1994లో చంద్రబాబు హయాంలో కేబినేట్‌ మంత్రిగా కూడా పనిచేశారు.

నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తరువాత 2019లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా వైసీపీ నుంచి పోటీచేసి విజయం సాధించారు. గూడూరు నియోజకవర్గంపై దుర్గాప్రసాద్‌ చెరగనిముద్ర వేశారు. అన్నివర్గాలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. అనేకమంది నేతలతో సత్సంబంధాలున్నాయి.

ఎంపీగా విజయం సాధించిన తర్వాత కూడా దుర్గాప్రసాద్‌ తిరుపతి పార్లమెంట్‌ స్థానంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.

You might also like