FbTelugu

జడ్జీలు జగన్ వెంట్రుకను కదపలేరు: ఎమ్మెల్సీ రవీంద్ర

అమలాపురం: జడ్జీలు కాని, కేసులు కాని, న్యాయ వ్యవస్థ తో పాటు చంద్రబాబు నాయుడు గాని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి వెంట్రుకని కూడా కదపలేవని వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు చేసిన తీవ్ర వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు ను స్వాగతిస్తూ వైసీపీ నాయకులు అల్లవరం మండలం గుడ్డివానిచింత వద్ద బుధవారం నాడు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి రవీంద్ర బాబు పాలాభిషేకం చేశారు. జగన్ తీసుకున్న మూడు రాజధానులకు మద్దతుగా, కోర్టులకు వ్యతిరేకంగా ఆయన ఘాటు విమర్శలు చేశారు.

అమరావతిలో రాజధాని రైతులకు అన్యాయం జరిగిందని ఆందోళన చేస్తున్నవారందరూ రైతులు కాదని, వారి ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉద్యమం చేస్తున్నారని రవీంద్రబాబు ఆరోపించారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సీఎం మూడు రాజధానులను ప్రకటించారని ఆయన అన్నారు.

You might also like