FbTelugu

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి డొక్కా

అమరావతి: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గా డొక్కా మాణిక్య వరప్రసాద్ పేరును పార్టీ ఖరారు చేసింది. పార్టీ ఆదేశం మేరకు రేపు తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు.

ఏపీలో రేపటితో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు ముగియనుంది. ఇప్పటి వరకూ నామినేషన్లు ఒక్కటి కూడా దాఖలు కాలేదు. మాణిక్య వర ప్రసాద్‌ రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని ఆయనతోనే భర్తీ చేసేందుకు వైసీపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.

ఇంతకు ముందు ఆయన టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇటీవలే ఆ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు.

You might also like