FbTelugu

రాజధాని పేరుతో బోగస్ ఉద్యమం: ఎమ్మెల్యే శ్రీదేవి

అమరావతి: అమరావతి రాజధాని కోసం చేస్తున్న ఉద్యమం అంత బోగస్ అని, ఫొటోల కోసం చేస్తున్న ఉద్యమం అని వైసిపి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రచార ఉద్యమాలు ఎవరైనా చేయవచ్చని చురక అంటించారు.

ఇవాళ శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ, రైతులెవరూ తనను కలవలేని, సమస్యలపై రైతులు వచ్చి కలిస్తే తప్పకుండా పరిష్కరిస్తానని ఆమె తెలిపారు. త్వరలోనే రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు. అంతకు ముందు సచివాలయం ప్రారంభోత్సవానికి వెళ్తున్న శ్రీదేవిని లింగాయపాలెం వద్ద మహిళా రైతులు, రాజధాని రైతులు అడ్డుకున్నారు. అసైన్డు కౌలు, అమరావతి ఫించన్ కోసం వినతి పత్రం ఇచ్చేందుకు రాగా పోలీసులతో అడ్డుకుంటారా అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.