FbTelugu

ఆనందయ్య మందుపై వైసిపి ఎమ్మెల్యే ధనదాహం

నెల్లూరు: కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు విక్రయం ద్వారా కోట్లాది రూపాయలు పోగేసుకోవాలని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.
మే 21వ తేదీ నుంచి ఆనందయ్య మందును ఎలాగైనా సొంతం చేసుకోవాలని వైసిపి ఎమ్మెల్యే కుట్రలు పన్నారని ఆయన అన్నారు. శ్రేషిత టెక్నాలజీ వద్ద ఇంటర్ నెట్ సైటను కొనుగోలు చేసి, ఆ తరువాత తొలగించారన్నారు. ఈ కంపెనీలో డైరెక్టర్లందరూ వైసిపి కి చెందినవారేనని ఆయన విమర్శంచారు. ఫ్యాన్ గుర్తు, సిఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, కాకాణి ఫొటోలు, వైసిపి రంగులతో వెబ్ సైట్ హోమ్ పేజీ తయారు చేశారు. నకిలీ మద్యం, నకిలీ పత్రాల తరహాలోనే నకిలీ వెబ్ సైట్ రూపకల్పన చేశారన్నారు. ఆనందయ్య మందు ఎదురుచూస్తున్న కోట్లాది మంది ప్రజల వద్ద భారీగా వసూలు చేసేందుకు కుట్రకు తెరలేపారు. రూ.15 కె మందు విక్రయిస్తున్నామని చెప్పినప్పటికీ, ఆర్డర్ చేస్తే బిల్లు రూ.167కు చేరిందని అన్నారు. ఇదేంటని పలువురు ఆశ్చర్యపోయి ఆనందయ్యకు ఫిర్యాదు చేశారన్నారు. వైసిపి ఎమ్మెల్యే ధనదాహం చూసి ఆనందయ్య వెనక్కి తగ్గారని, ఆయన కుమారుడు వీడియో విడుదల చేయడంతో ఎమ్మెల్యే కంగుతిన్నారని సోమిరెడ్డి అన్నారు.
వైసిపి నాయకుల నుంచి ఇంకా ఆనందయ్యకు స్వేచ్ఛ రాలేదన్నారు.

తెలంగాణ రాష్ట్రం నుంచి ఆనందయ్యను సన్మానించడానికి వచ్చిన యాదవ సంఘం నాయకులను పోలీసులతో తరిమిచ్చి కొట్టించారని ఆయన ఆరోపించారు. మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలని కోర్టుకు వెళ్తే ప్రభుత్వ లాయర్ అడ్డుకుంటున్నారన్నారు. ఈ వెబ్ సైట్ వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారుల గుట్టు విప్పి చర్యలు తీసుకోవాలని, లేదంటే మేమే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు. కోటి మందికి ఆన్ లైన్ లో మందు విక్రయించి రూ.120 కోట్లు కొల్లగొట్టాలని ఎమ్మెల్యే ప్లాన్ చేశారని, బెడిసికొట్టడంతో తమకు సంబంధం లేదని ప్రకటన ఇచ్చారని సోమిరెడ్డి ఆరోపించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.