FbTelugu

వైద్యులకు మానవత్వం లేదు: అంబటి రాంబాబు

గుంటూరు: కరోనా బాధితులను డాక్టర్లు పిండెస్తున్నారని, ఫీజుల విషయంలో హస్పిటల్ యాజమాన్యాలు పేషెంట్లను ఇబ్బంది పెడుతున్నారని వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు.

మానవాతా దృక్పథం లేని వైద్యులు జాతికి భారం అని ఆయన అన్నారు. ఇలాంటి వారిని సమాజం నుంచి వెలివేయాలని, ఫిర్యాదు వస్తే వారిని క్షమించేది లేదని రాంబాబు స్పష్టం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, సత్తెనపల్లిలో అనాధ శవాలకు ఉచితంగా అంత్యక్రియలు జరిపిస్తామన్నారు. కరోనా సమాజంలో భయోత్పాన్ని సృష్టిస్తోందని, తండ్రి చనిపోతే పిల్లలు దహనం చేయలేని పరిస్థితి ఉందన్నారు. ఆధునిక సమాజంలో ఇలాంటి పరిస్థితులు రావడం దురదృష్టకరం అన్నారు. మన దేశం ఇంకా అజ్ఞాన సంప్రదాయాలకు పెద్దపీట చేయటం శోచనీయమన్నారు. అనాధ శవాల ఖననం కోసం స్వచ్చంద సంస్థలు ముందుకు రావటం మంచి పరిణామమని రాంబాబు అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.