FbTelugu

తెలంగాణ పోలీసులపై వైసీపీ నేత దౌర్జన్యం

ఒంగోలు: ఒంగోలు వన్‌టౌన్‌ స్టేషన్‌ ఎదుటే వైస్సార్ పార్టీ నేత హడావుడి చేశాడు. తెలంగాణ పోలీసులపై దౌర్జన్యనికి దిగాడు. వారి కారు నుంచి మహిళ దించివేసినా స్థానికల పోలీసులు అడ్డుకునే బదులు చోద్యం చూస్తూ నిల్చున్నారు.

ఒంగోలు వన్‌టౌన్‌ వద్ద అధికార వైసీపీ నాయకుల హడావుడితో ఉద్రిక్తత నెలకొంది. సుమారు ఏడు గంటలపాటు హైడ్రామా చోటుచేసుకుంది. తెలంగాణ పోలీసులపైనే దౌర్జన్యం చేసి వారి అదుపులో ఉన్న మహిళను బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఈ నేపథ్యంలో పోలీసులు, వైసీపీ నేత ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకునేదాక పరిస్థితి వెళ్లింది. వైసీపీ యువజన విభాగం నగర అధ్యక్షుడు గంటా రామానాయుడు సతీమణి రమ్యశ్రీపై అరెస్టు వారెంట్‌ ఉండటంతో హైదరాబాద్‌  కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డుకు చెందిన పోలీసులు ఒంగోలుకు వచ్చారు.

ఒక మహిళా కానిస్టేబుల్‌తో పాటు మరో పోలీసు వన్ టౌన్ పోలీసు స్టేషన్ కు వచ్చారు. లాయర్‌పేటలోని రామానా యుడు ఇంటికి వెళ్లి రమ్యశ్రీని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన విషయాన్ని స్థానిక పోలీసులకు తెలిపేందుకు వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌కు ఆమెను తమ వాహనంలో తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసి ఆమె బంధువులు స్టేషన్‌కు చేరుకుని తెలంగాణ పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. రమ్యశ్రీని కారు దింపి తమ వాహనంలో తీసుకెళ్లారు. అక్కడే ఉన్న సీఐ సీతారామయ్యతో పాటు ఇతర పోలీసులు బయటకు వచ్చి ఘటనను చూస్తూ ఉండిపోయారు తప్ప అడ్డుకోలేదు.

ఈ ఘటన తరువాత ఆమె బంధువులు తెలంగాణ పోలీసులపై రివర్స్ కేసు పెట్టారు. రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు సీఐ సీతారామయ్య తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.