FbTelugu

కన్నా.. నీ దారెటన్నా..?

కన్నా లక్ష్మీనారాయణ. కాంగ్రెస్‌ పార్టీలో ప్రముఖ నేత. ఉమ్మడి ఆం్ర«ధప్రదేశ్‌ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన నేత. పార్టీ అధిష్టానం వద్ద కూడా పలుకుబడి ఉన్న నాయకుడు. కానీ, ఆయన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో కాంగ్రెస్‌ పరిస్థితి దారుణంగా తయారైంది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఏపీ జనం అంతా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మారారు. దీంతో కన్నా లక్ష్మీనారాయణ కూడా కాంగ్రెస్‌లో ఇమడలేక పోయారు.

తన రాజకీయ భవిష్యత్‌ కోసం కాంగ్రెస్‌కు రాజీనామా చేసి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్టీలో చేరిన కొత్తలో కన్నాకు ఆ పార్టీ అధిష్టానం కూడా మంచి ప్రాధాన్యమే ఇచ్చింది. ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించి గుర్తింపునిచ్చింది. కానీ, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా ఆయనను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. దీంతో ఆయన పరిస్థితి దారుణంగా మారింది. 2019 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌ బిజెపిలో కొన్ని కీలక మార్పులు జరిగాయి. ప్రధానంగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విషయంలో బీజేపీ అధిష్టానం అనుసరించిన వైఖరి కాస్త ఇబ్బందికరంగా మారింది అనే భావన ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం పై సమర్థవంతంగా విమర్శలు చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్న కన్నా లక్ష్మీనారాయణ విషయంలో బీజేపీ పెద్దలు కాస్త అవమానకర రాజకీయం చేశారు. ఆయనను పక్కకు తప్పించి సోము వీర్రాజుకు బాధ్యతలు అప్పగించారు. వైసీపీ అధిష్టానం మద్దతు ఉన్న ఆయన రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బీజేపీ పరిస్థితి చాలా దారుణంగా మారింది. ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ నేతలు పక్కన పెట్టిన తర్వాత కన్నా లక్ష్మీనారాయణ పెద్దగా ఎక్కడా బీజేపీ కార్యక్రమాల్లో క్రియాశీలంగా ఉండే ప్రయత్నం కూడా చేయలేదు. అయితే ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణపై వైసీపీ నేతలు కన్నేశారు.

ఎంతో రాజకీయ అనుభవం, జనాకర్షణ కలిగి ఉన్న నేత కావడంతో వైసీపీ నేతలు ఆయనను పార్టీలో చేర్చుకునే పనిలో పడ్డారట. దీనిలో భాగంగా వైసీపీ మంత్రులు, నేతలు కొందరు ఆయనతో మాట్లాడినట్టు సమాచారం. కానీ, కన్నా పార్టీ మారి వైసీపీలో చేరాలా.. లేక బీజేపీలో కొనసాగాలా అన్న సందిగ్ధంలో ఉన్నారట. బీజేపీలో ఆయనకు పెద్దగా గౌరవం దక్కడం లేదు కాబట్టి ఆ పార్టీలో ఉన్నా లాభం లేదు కదా అన్న ఆలోచనలో ఉన్నారట. వైసీపీ కూడా ఆయనకు అనేక అవకాశాలు కల్పించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లాకు చెందిన ఒక మంత్రి, అలాగే ఒక రాజ్యసభ ఎంపీ ఆయనను వైసీపీలోకి తీసుకొచ్చేనందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లుగా సమాచారం. వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట నుంచి ఎంపీ టికెట్‌ కేటాయిస్తామని హామీ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. మరి కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలో చేరుతారా లేదా అనేది చూడాలి. అయితే ఉగాది తర్వాత ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యే అవకాశాలున్నాయన్న వార్తలు ఏపీలో గుప్పుమంటున్నాయి. కన్నా దారెటో తేలాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందేనని వైసీపీ, బీజేపీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.