FbTelugu

ట్రాక్టర్ తో తొక్కించి చంపిన వైసీపీ నేత

గుంటూరు: నకరికల్లు మండలం శివాపురంలో వైసీపీ నేత దారుణానికి తెగబడ్డాడు. నర్సింగపాడు వైసీపీ నేత శ్రీనివాస్ రెడ్డి రమావత్ మంత్రూభాయి (55) అనే మహిళను ట్రాక్టర్ తో తొక్కించి చంపేశాడు. తొక్కించడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

మూడు సంవత్సరాల క్రితం బోనముక్కల శ్రీనివాసరెడ్డి వద్ద రు.3.80 లక్షలు భార్యాభర్తలు అప్పు తీసుకున్నారు. అప్పు తీసుకునే ముందు తమ పొలాన్ తనఖా పెట్టారు. అప్పు తీర్చనందుకు శ్రీనివాసరెడ్డి ఇవాళ పొలంలో ఉన్న సమయంలో ట్రాక్టర్ తో తొక్కించాడు.

You might also like