FbTelugu

వైసీపీ నేత వెబ్ సైట్… టీఆర్ఎస్ గెలుపంట?

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్ కు కొద్ది గంటల ముందు వైసీపీ నాయకుడికి చెందిన న్యూస్ వెబ్ సైట్ టీఆర్ఎస్ కు అనుకూలంగా ఎగ్గిట్ పోల్ ఫలితాలు ప్రకటించింది.

రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం పోలింగ్ కు ముందూ ఎవరూ ఎగ్జిట్ ఫలితాలు ప్రకటించకూడదు. అయినా ఆ వెబ్ సైట్ యజమాని టీఆర్ఎస్ పార్టీకి లబ్ధి కలిగేలా తప్పుడు పోల్స్ ఫలితాలు వెల్లడించారు. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఇదే కాకుండా కొన్ని పనికిరాని, ఊరుపేరు లేని సంస్థలు కూడా టీఆర్ఎస్ గెలుస్తుందంటూ సోషల్ మీడియాలో ఓటర్ల సరళి అంటూ వెల్లడించాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.