FbTelugu

పోలీసులపైకి కుక్కలను వదిలిన వైసీపీ నేత

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో జరిగిన గొడవ కేసులో అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులపైకి వైసీపీ నేత కుక్కలు వదిలాడంటూ కేసు నమోదైంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో జరిగిన గొడవ కేసులో వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపైకి కుక్కలను వదిలారు. దీంతో భయంతో బంజారాహిల్స్ పోలీసులు వెనుదిరిగారు. పీవీపీ నిర్వాకంపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో బంజారాహిల్స్ ఎస్ఐ హరీష్ రెడ్డి ఫిర్యాదు చేయగా.. ఐపీసీ సెక్షన్ 353 కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

You might also like