FbTelugu

పోలీసుల అదుపులో వైసీపీ నేత

భూవివాదంలో బెజ‌వాడ వైసీపీ నేత‌.. బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు

హైదరాబాద్: వైసీపీ నాయకుడు పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) ని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తన ఇంటి పక్కనే ఉన్న కైలాష్ విక్రం అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పీవీపీని అదుపులోకి తీసుకు విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 14లో తన నివాసం పక్కనే కైలాష్ విక్రం అనే వ్యక్తి ఇంటిని నిర్మాణం చేస్తున్నాడు. పీవీపి అనుచరులం అని కొందరు తనపై దాడి చేశారని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో కైలాష్ ఫిర్యాదు చేశాడు.
స్థలానికి సంబంధించిన పత్రాలు తనవద్ద ఉన్నాయని చెప్పినా వినకుండా దాడి చేశారని పోలీసులకు తెలిపాడు. ఇద్దరిని బంజారాహిల్స్ స్టేషన్ లో పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

You might also like