FbTelugu

ఉద్యోగాల పేరిట వైసిపి నేత లక్షలు వసూలు

విజయనగరం: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్.సి.ఐ)లో ఉద్యోగాలు కల్పిస్తానంటూ వైసిపి నాయకుడు ఒకరు లక్షల్లో నిరుద్యోగులకు కుచ్చుటోపి వేశాడు. విజయనగరం జిల్లా బాడంగికి చెందిన వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి పెద్దింటి రామారావు పై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎఫ్‌సీఐలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రామారావు తమ నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడని నిరుద్యోగులు ఆరోపించారు. ఒక్కొక్కరి నుంచి రూ. 15 నుంచి 25 లక్షల వరకు వసూలు చేశాడన్నారు. మోసాన్ని గ్రహించిన బాధితులు డబ్బు తిరిగి ఇవ్వాలంటూ రామారావు చుట్టూ తిరుగుతున్నామన్నారు. ఎంతగా అడిగినా సరైన సమాధానం చెప్పకుండా మొహం చాటేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నాడన్నారు. రామారావుపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, వదిలే ప్రసక్తి లేదని బాధితులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.