FbTelugu

వైసీపీ నేత దారుణ హత్య

కర్నూలు: వైసీపీ నేతను అతి దారుణంగా వేటకొడవళ్లతో నరికి హత్య చేసిన ఘటన జిల్లాలోని కోసంగి మండలం కోలమాను పేటలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కోలమాను పేటకు చెందిన గోవింద్ అనే వైసీపీ నేతను అతని పొలంలోని కొందరు గుర్తు తెలియని దుండగులు వేట కొడవళ్లతో అతి దారునంగా నరికి చంపారు. ఈ కేసులో కుటుంబ సభ్యులపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.