FbTelugu

వైసీపీ నేత దారుణ హత్య

కర్నూలు: వైసీపీ నేత దారుణ హత్యకు గురైన ఘటన జిల్లాలోని కోలమానుపేటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవింద అనే వ్యక్తి (వైసీపీ నేత) అతని భార్య నిన్న పొలం పనులకు వెళ్లి ఇంటికి వచ్చారు. అనంతరం గోవింద పనిమీద మళ్లీ పొలం వద్దకు వెళ్లాడు.

అప్పటికే దారివెంట కాచుకొని ఉన్న కొందరు దుండగులు గోవిందను అతి దారుణంగా వేటకొడవళ్లతో నరికి హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.