FbTelugu

మద్యం మత్తులో మహిళను తన్నిన వైసీపీ నేత

కడప: మహిళను నడిరోడ్డుపై కాలితో తన్ని, బూతులు తిట్టిన వైసీపీ నేతను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకెలితే.. వైసీపీ నేత మహబూబ్ బాషా రోడ్డుపై వెళుతున్న ఓ మహిళను అకారణంగా దుర్భాషలాడడంతో ఇదేంటని ఆ మహిళ ప్రశ్నించింది.

దీంతో కోపోద్రేకుడైన బాషా ఒక్కసారిగా మహిళను కాలితో తన్ని, జుట్టు పట్టుకొని కొట్టినట్టు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అతన్ని అరెస్టు చేశారు. కాగా బాషా మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like