FbTelugu

వైసిపి వేధింపులు… ఆశా వర్కర్ ఆత్మహత్యాయత్నం

అనంతపురం: వైసిపి కార్యకర్తలు ఆశా వర్కర్లు, వాలంటీర్లను కూడా వదిలిపెట్టకుండా వేధించుకు తింటున్నారు. ఆశా వర్కర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డం పరిపాటు అయ్యింది. వీరి వేధింపులతో రాప్తాడు మండలం ఎం.చెర్లోపల్లి ఆశావర్కర్‌ అనిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

ఆదివారం సాయంత్రం అనిత అనంతపురం చేరుకుని ఓ దుకాణంలో విష ద్రావకాన్ని కొనుగోలు చేసి పక్కకు వచ్చి సేవించింది. అది గమనించిన స్థానికులు ఆమెను హుటాహుటిన సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించడంతో ప్రాణాలతో బయటపడింది. అనిత ఆశావర్కర్‌గా పదేళ్లుగా పని చేస్తోంది. నాలుగు రోజుల క్రితం గ్రామానికి చెందిన కొందరు వైసిపి కార్యకర్తలు   ఈమెను పిలిచి  తాము చెప్పినట్లు వినాలని హుకం జారీ చేశారు. తాము రమ్మన్న చోటుకు రాకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని హుంకరించారు. వీరి వేధింపులు తట్టుకోలేక ఆదివారం రాప్తాడు పోలీసు స్టేషన్‌కు వెళ్లి వైసిపి కార్యకర్తలపై ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు పట్టించుకోకపోవడంతో అదే రోజు సాయంత్రం విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.