FbTelugu

జివిఎంసి, వాలంటీర్ వ్యవస్థపై వైసిపి కార్పొరేటర్ ఫిర్యాదు

విశాఖపట్నం: గ్రేటర్ విశాఖపట్నం, వాలంటీర్ల అవినీతితో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయంటూ అధికార పార్టీకి చెందిన వార్డు మెంబర్ ఫిర్యాదు చేసిన సంచలనం సృష్టించారు.

తన లెటర్ హెడ్ పై జివిఎంసి కమిషనర్ కు 73వ వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత ఫిర్యాదు చేశారు. అయినా స్పందించకపోవడంతో ఏకంగా కౌన్సిల్ లోనే అధికారుల అవినీతిని ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నది. కరోనా వైరస్ విస్తరించకుండా ప్రభుత్వం తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయం అమల్లో ఉంటే మరో వైపు అక్రమాదారులు రెచ్చిపోతున్నారని ఆమె తెలిపింది. ఇప్పటికే గాజువాక తాహశీల్దార్ 23 మంది పై భూ ఆక్రమణ కేసులు నమోదు చేశారు. జివిఎంసి అధికారుల తీరుతో అనధికార నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోవడం విశేషం. ప్రభుత్వం ప్రారంభించిన వాలంటీర్ వ్యవస్థ పై కార్పొరేటర్ సుజాత అవినీతి ఆరోపణలు చేస్తూ లేఖలో ప్రస్తావించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.