FbTelugu

యశోద, కిమ్స్ పై ఏ చర్యలు తీసుకున్నారు: హైకోర్టు

హైదరాబాద్: కరోనా చికిత్స కోసం వెళ్లిన బాధితులకు రూ.4లక్షలకు పైగా బిల్లులు వేసిన యశోద, కిమ్స్ ఆస్పత్రులపై ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించింది.

ప్రైవేటు ల్యాబుల్లో అన్ని రకాల పరీక్షలకు గరిష్ట చార్జీలు ఖరారు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా పరీక్షలు, చికిత్సలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయక పోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. గాంధీ ఆస్పత్రిలోనూ కరోనా పరీక్షలు జరపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కేంద్రం కల్పించిన అధికారాలతో ప్రైవేట్ ఆస్పత్రులను నియంత్రిచాలని సూచించింది. ఆస్పతుల్లో బెడ్లు, వెంటిలేటర్ల వివరాలు విస్తృత ప్రచారం చేయాలని వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించింది. నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో కరోనా చికిత్సలు చేస్తారా చెప్పాలని ప్రభుత్వ అడ్వకేట్ ను ప్రశ్నించింది.

కరోనా పై పూర్తి వివరాలతో ఈ నెల 27లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణ వాయిదా వేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.