FbTelugu

కౌన్సిల్ లో పరిణామాలు కలచివేశాయి: యనమల

అమరావతి: నిన్న శాసన మండలిలో జరిగిన పరిణామాలు తీవ్రంగా కలిచివేశాయని టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికార పార్టీ ఇంతలా అరాచకాలకు పాల్పడడం ఏనాడూ చూడలేదని అన్నారు.

తాను ఏనాడూ అన్ పార్లమెంటరీ భాష వాడలేదని అన్నారు. విధ్వంసం చేస్తామనే మాట తాను అనలేదని.. కావాలంటే రికార్డులను పరిశీలించుకోండంటూ సవాల్ విసిరారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికే తాము పోరాడుతున్నట్టు తెలిపారు.

You might also like