FbTelugu

‘స్థానికం’పై గవర్నర్ జోక్యం చేసుకోవాలి: యనమల

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, ఏపీ ప్రభుత్వానికి మధ్య తలెత్తుతున్న సమన్వయ లోపం పట్ల రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకోవాలని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు.

స్థానిక ఎన్నికల‌ను ఎదుర్కొలేకనే జ‌గ‌న్ నాటకాలు ఆడుతున్నరని అన్నారు. ఆర్టికల్‌ 243ఏ, 243కే(1) ప్రకారం ఎన్నికల నిర్వహణపై అధికారం ఈసీకే ఉంటుంద‌న్నారు. ఎస్ఈసీకి ప్ర‌భుత్వం స‌హ‌క‌రించ‌క పోవ‌డం స‌రికాద‌న్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.