అమరావతి: ఏపీలో అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ పూర్తిగా విఫలమైందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వానిది ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో ఆర్థిక పురోగతి, ద్రవ్య నిర్వహణలో తీరోగమనం ప్రారంభమైందన్నారు. రాష్ట్రంలో రెండంకెల వృద్ధి 8.16 శాతానికి దిగజారిందని ప్రభుత్వ లెక్కలే చెప్పాయన్నారు. రూ.12,748 కోట్ల రెవెన్యూ లోటు పెరిగిపోవడం వైసీపీ చేతగానితనమేనన్నారు.