FbTelugu

టాప్ 15 జిల్లాల్లోకి కర్నూలు చేరింది: యనమల

అమరావతి: దేశంలోనే అత్యధిక కరోనా కేసులున్న టాప్ 15 జిల్లాల్లోకి కర్నూలు చేరిందని టీడీపీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. జగన్ నిర్లక్ష్య దోరణి కారణంగానే ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయని అన్నారు. కరోనాను మొదట్లో పాలనా యంత్రాంగం తేలికగా తీసుకుందని అన్నారు.

దేశంలో కరోనా కేసుల సంఖ్యలో 8వ స్థానంలో, మరణాల్లో 6వ స్థానంలో ఏపీ ఉందని తెలిపారు. వైసీపీ నేతలు గుంపులు గుంపులుగా తిరగడమే కరోనా వ్యాప్తికి ప్రధాన కారణమన్నారు. వైసీపీ నేతల తీరును కేంద్ర మంత్రులే తప్పుపట్టారని అన్నారు. కరోనా కోసం కేంద్రం ఇచ్చిన నిధులను దారిమళ్లించారని ఆరోపించారు.

You might also like