అమరావతి: ముఖ్యమంత్రి జగన్ ఏడాది పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ఏపీలో ఇంతకి ముందు ఉన్న స్కీములనే రద్దు చేసి పేర్లు మర్చారని ఆరోపించారు. తప్పుడు కేసులతో అన్ని వర్గాలను క్షోభపెట్టారని అన్నారు. దాడులు దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చారని అన్నారు.