FbTelugu

ఏపీ లో నియంత పాలన: యనమల

అమరావతి: ఏపీ లో నియంత పాలన కొనసాగుతోందని
శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు.
తిరుపతి ఎయిర్ పోర్టులో చంద్రబాబు నిర్బంధం అప్రజాస్వామికం అన్నారు. చంద్రబాబు నిర్బంధం పౌర స్వేచ్ఛను హరించడమేనాని అన్నారు.

చంద్రబాబు పేరు వింటేనే జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతోంది. ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు ఆయనకు ఉంది. జగన్మోహన్ రెడ్డి చర్యలు హిట్లర్ పాలనను తలపిస్తున్నాయి. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైంది. పోలీసులు వైసీపీ నేతలకు తొత్తులుగా మారారు. ఏపీలో రూల్ ఆఫ్ లా ఉందా? అని ప్రశ్నించారు. చర్యకు ప్రతి చర్య తప్పదని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలని యనమల హెచ్చరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.