FbTelugu

యాదగిరిగుట్ట దర్శనాలు రేపటినుంచి బంద్

యాదగిరిగుట్ట: రాష్ట్రప్రభుత్వం లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో యాదాద్రి దేవాలయం పాలక మండలి కీలక నిర్ణయం తీసుకున్నది. రేపటి (బుధవారం)నుండి ఈ నెల 21వ తేదీ వరకు యాదాద్రిలో భక్తుల దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

రేపు ఉదయం 10 గంటల వరకే దర్శనాలకు అనుమతిస్తున్నామని తెలిపింది. అంతరంగికంగా యథావిధిగా స్వామివారి నిత్య కైంకర్యాలు కొనసాగుతాయని వెల్లడించింది. రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో విధిలేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నామని, భక్తులు గమనించాలని దేవాలయం పేర్కొంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.