FbTelugu

యాదాద్రి చేరుకున్న సుప్రీంకోర్టు సిజె

యాదాద్రి: సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ దంపతులు ఇవాళ ఉదయం యాదాద్రి గుట్ట పైకి చేరుకున్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా బాద్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనార్థం వచ్చారు.

గుట్ట పై కొత్తగా నిర్మించిన వివిఐపి అతిథి గృహం వద్ద దేవాదాయ శాఖ మంత్రి ఏ.ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆదివారం నాడు ఆయన ఆలయం సందర్శించాల్సి ఉంది. చీఫ్ జస్టిస్ నివాసంలో వేరే కార్యక్రమం ఉండడంతో మంగళవారానికి వాయిదా పడింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.