FbTelugu

కేంద్రం ఆదేశంతోనే యాదాద్రి జిల్లా కలెక్టర్ బదిలీ?

హైదరాబాద్: భూకబ్జాలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించినట్లు ఫిర్యాదులు రావడంతో యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ ను బదిలీ చేసినట్లు ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పిఎల్ఎన్.రావు అనే వ్యక్తి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ పై ఈ ఏడాది మార్చి నెలలో కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ (డిఒపిటి) కు ఫిర్యాదు చేశారు. ఆధారాలతో సహా ఆయన చేసిన ఫిర్యాదుపై అంతర్గత విచారణ జరిపిన డిఒపిటి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జరీ చేసినట్లు తెలిసింది. ఆమెను యాదాద్రి జిల్లా నుంచి బదిలీ చేయాలని మే నెలలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను డిఒపిటి సూచించింది. ఆ ప్రకారంగానే ప్రధాన కార్యదర్శి శనివారం రాత్రి ఆమెను బదిలీ చేసి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. నూతన జిల్లా కలెక్టర్ గా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పమేలా సత్పతిని నియమించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.