FbTelugu

అభిషేక్ అయితే ఇలాగే మాట్లాడతారా?: కంగనా

ఢిల్లీ: నటీమణి, రాజ్యసభ సభ్యురాలు జయాబచ్చన్ పై మరో నటీమణి కంగనా రనౌత్ ఘాటు విమర్శలు చేశారు. రాజ్యసభలో ఆమె మంగళవారం చేసిన ప్రసంగంపై కంగనా తీవ్ర అభ్యంతరం చెప్పారు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాదిరి… మీ కుమారుడు అభిషేక్ బచ్చన్ మరణిస్తే ఇలాగే మాట్లాడతారా అంటూ కంగనా నిలదీసింది. నా మాదిరే మీ కుమార్తే శ్వేతాబచ్చన్ టీనేజీలో వేధింపులకు గురైతే ఇలాగే స్పందిస్తారా, వేధింపులతో ఒత్తిడికి గురై సుశాంత్ లా అభిషేక్ కూడా ఆత్మహత్య చేసుకుంటే ఇలానే మాట్లాతారా అంటూ ప్రశ్నించింది. మా పైన కాస్త దయ, జాలి చూపండని కంగనా ఆమెపై మండిపడ్డారు.

బాలీవుడ్ పరిశ్రమపై ఎంపీ రవికిషన్ మాట్లాడిన తీరుపై జయా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమలో ఉంటూ డ్రగ్స్ మాఫియా అంటూ విమర్శలు చేయడం సిగ్గుచేటని ఆమె ఖండించారు. ఇవాళ జీరో ఆవర్ లో ఈ అంశంపై జయాబచ్చన్ మాట్లాడారు. సోషల్ మీడియా వేదికగా సినిమా పరిశ్రమ వాళ్లను వేధింపులకు గురి చేస్తున్నారని, డ్రగ్స్ పేరుతో చిత్ర పరిశ్రమకు చెడ్డ పేరు తెస్తున్నారన్నారు. ఈ పరిశ్రమ నుంచి పైకి వచ్చి ఇదే పరిశ్రమ చెడ్డదంటూ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని జయా తూర్పారబట్టారు.

You might also like