FbTelugu

ఇంట్లో పూజలు… 21 మంది కరోనా!

తూ.గో.జిల్లా: కరోనా వైరస్ విజృంభిస్తున్నదని ప్రభుత్వం ఎంతగా చెప్పినా ప్రజలు పట్టించుకోవడం లేదు. ఎవరెన్ని చెప్పినా తమ మూడభక్తిని మాత్రం విడవడం లేదు.
తొండంగిలో ఉమ్మడి కుటుంబంలో 21 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఒక ఇంట్లో పూజా కార్యక్రమానికి నాలుగు కుటుంబాలను ఆహ్వానించారు.

ఈ పూజలో పాల్గొన్న వారిలో కొందరికి జ్వరం, జలుబు లక్షణాలు రావడంతో పరీక్షలు చేయించారు. తొలుత ఒకరిద్దరికి కరోనా పాజిటివ్ లక్షణాలు వెల్లడి అయ్యాయి. మిగతా వారికి కూడా పరీక్షలు నిర్వహించగా మొత్తం 21 మందికి పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఏపీలో నాలుగు నెలల తరువాత గురువారం నాడు గరిష్టంగా పాజిటివ్ కేసులు 758 నమోదు అయ్యాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.