FbTelugu

ఆ కొత్త రకం వైరస్ కుటుంబాలను కూల్చుతున్నది

న్యూఢిల్లీ: ఇండియాతో పాటు 44 దేశాల్లో గుర్తించి కొత్తరకం కరోనా వైరస్ బి.1.617 వేరియంట్ లక్షలాది కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తూ బజారునపడేస్తున్నది. ఈ కొత్తరకం వైరస్ ను తొలుత భారత్ లోనే గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఒ) ప్రకటించింది.
ఈ రకం వైరస్ కారణంగానే బ్రిటన్ లో భారీగా కేసులు నమోదు అయ్యాయి.

ఇది వేగంగా వ్యాప్తి చెందుతుందని, అత్యంత ప్రమాదకరని డబ్ల్యూహెచ్ఒ హెచ్చరించింది. అసలు వైరస్ కన్నా ఇది తేలికగా, సలువుగా వ్యాప్తి చెందుతూ ప్రాణాలను తీసేస్తున్నదని స్పష్టం చేసింది. సెకండ్ వేవ్ లో ఊహించని మరణాలకు, కేసులకు ఈ వేరియంటే కారణమని డబ్ల్యూహెచ్ఒ వివరించింది. అత్యధిక జనాభా ఉన్న ఇండియా, ఆ తరువాత అమెరికా కరోనా కేసుల నమోదు, మరణాల్లో తొలి, ద్వితీయ స్థానాలను ఆక్రమించాయి. వ్యాక్సినేషన్ కారణంగా అమెరికాలో కేసులు తగ్గుతుండగా, ఇండియాలో సెన్సెక్స్ మాదిరి పెరుగుతుండడం విశేషం.

You might also like

Leave A Reply

Your email address will not be published.