FbTelugu

ప్రపంచ కరోనా సమాచారం

ప్రపంచ వ్యాప్తంగా నేటికి కరోనా కేసుల సంఖ్య 15,18,719 కి చేరింది. కరోనా సోకిన వారిలో ఇప్పటివరకు 88,502 మంది మృతి చెందారు. ఒక్క అమెరికాలోనే కరోనా కేసుల సంఖ్య 4,34,114 కి చేరగా.. 14,762 మంది మృత్యువాత పడ్డారు.

ఇటలీలోను కరోనా విలయ తాండవం చేస్తోంది. ఇప్పటివరకు ఇటలీలో కరోనా కేసుల సంఖ్య 1,39,422 మందికి చేరింది. కాగా 17,669 మంది మరణించారు. స్పెయిన్ లో 1,48,220 కరోనా కేసులు నమోదు కాగా.. 14,792 మంది మృతి చెందారు. ఫ్రాన్స్ లో 82,048 మందికి కరోనా సోకగా.. 10,869 మంది మరణించారు.

You might also like